![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi )ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1020 లో..... లక్కీ, రాజు కలిసి భోజనాలకి వచ్చిన వారి దగ్గర చదివింపు పేరిట డబ్బులు వసూల్ చెయ్యాలని అనుకుంటారు. అప్పుడే ఇందు వచ్చి ఆపుతుంది. వాళ్ళపై కోప్పడుతుంది. అదే నేను చెప్తున్నా వినట్లేదని లక్కీపై రాజు నెట్టేస్తాడు. అది నీ ప్లాన్. దాన్ని వాడు ఫాలో అవుతాడంతే అని లక్కీని ఉద్దేశ్శించి ఇందు అంటుంది. ఆ తర్వాత అందరు వెళ్ళిపోయాక ఇంట్లో వాళ్ళు అందరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. మా పిల్లలు ఎప్పుడు ఇలా సెలెబ్రేషన్స్ చేయలేదు.. నీ వల్లే ఇదంతా అని ఇందుకి కృతజ్ఞతలు చెప్తాడు చలపతి.
అందరు స్వీట్ తింటుంటే అప్పుడే సాహో ఎంట్రీ ఇస్తాడు. ఒక్కటి తక్కువ అయిందని అనగానే రాజు టెన్షన్ పడతాడు. అదే కేక్ అని తెప్పించి లక్ష్మీ, చలపతిలచే కట్ చేయిస్తాడు. కేక్ తినిపించుకుంటుంటే సాహో అందులో ఏదైనా కలిపాడేమోనని రాజు ఆపుతాడు. అందులో ఏం కలపలేదని రాజుతో మెల్లిగా చెప్తాడు సాహో. మీ వాడు ఏదో జోక్ చేసాడు.. మీరు కానివ్వండి అని సాహో అంటాడు. ఆ తర్వాత రాజుని సాహో పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడుతాడు. నువ్వు డబ్బుల కోసమే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసావని నాకు తెలుసు కానీ ఇక నేను డబ్బుల కోసం ఆగను.. నీకు రెండు రోజులు టైమ్ ఇస్తానని సాహో వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఇక మా ఫ్యామిలీని రిస్క్ లో పెట్టలేనని రాజు అనుకొని రేఖకి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకుంటే మీ అమ్మాయి మీకు ఉండదని వార్నింగ్ ఇస్తాడు.
ఆ తర్వాత రేఖ దగ్గరికి శృతి వస్తుంది. మేడం అందరికి శాలరీస్ ఇవ్వాలి.. సంతకం పెట్టాలని అంటుంది. శాలరీస్ ఎంత అని రేఖ అడుగగా.. ఇరవై లక్షలు అని శృతి చెప్తుంది. ఆ అమౌంట్ నా అకౌంట్ కి ట్రాన్స్‌ఫర్ చెయ్ అని రేఖ అనగానే మేడమ్ శాలరీ రాకుంటే ఎంప్లాయిస్ ఇబ్బంది పడుతారని శృతి అనగానే వాళ్ళేం చావరులే అని రేఖ అంటుంది. ఆ తర్వాత శృతి వెళ్లి రాజ్, కావ్య ఫోటోని చూస్తూ వాళ్ళు ఉన్నప్పుడు శాలరీ అందరికి త్వరగా పడాలి.. లేదంటే ఇబ్బంది పడుతారు అన్న విషయం గుర్తు చేసుకొని..... మీరు వున్నప్పుడు ఎలా ఉన్నాం.. ఇప్పుడు ఎలా ఉన్నాం.. మమ్మల్ని పట్టించుకునే వారే లేరు అని శృతి బాధపడుతుంది. ఆ తర్వాత రాజు దగ్గరికి ఇందు వచ్చి మాట్లాడుతుంది. తరువాయి భాగంలో రేఖ డబ్బులు తీసుకొని బయల్దేర్తుంది. రేఖకి ఇందుని అప్పగించాలని రాజు అనుకొని తనని గుడికి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |